అబద్దాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్
నిప్పులు చెరిగిన మంత్రి రామానాయుడు
అమరావతి – ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామా నాయుడు నిప్పులు చెరిగారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఫైర్ అయ్యారు నిమ్మల. ఆయన మీడియాతో మాట్లాడారు.
మీరు చేసిన అప్పులను భరిస్తున్నామని, అంతే కాకుండా మీరు చేసిన తప్పులను కూడా ఎందుకు భరించాలో జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు రామానాయుడు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులతో పాటు అన్ని ప్రాజెక్టులు, జలాశయాలు, చెక్ డ్యామ్ లు జగన్ పాలన లో విధ్వంసానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
డయాఫ్రమ్ వాల్ ఎక్కడ నిర్మిస్తారో, ఏ ప్రాజెక్టుకు కడతారో కూడా తెలియని జగన్, అంబటి రాంబాబు లు ప్రాజెక్టుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు ల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.
జగన్ కు వైసీపీకి ప్రాజెక్టులు, జలాశయాలు, చెక్ డ్యాం ల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి నిమ్మల. గత టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర బడ్జెట్ ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టిందని, ఇందులో నీటి పారుదల శాఖకు రూ. 68 వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.