14 రోజుల్లో రూ. 20 కోట్ల అమ్మకాలు – సవిత
బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి
విజయవాడ: విజయవాడలో 14 రోజుల పాటు నిర్వహించిన గాంధీ బునకర్ చేనేత మేళా విజయవంతం అయ్యిందని అన్నారు ఏపీ బీసీ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి సవిత . ప్రజల నుంచి వచ్చిన స్పందన దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో మిగిలిన జిల్లాలోనూ చేనేత వస్త్ర ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఆగస్టు 7వ తేదీ నుండి ఈ నెల ఏడో తేదీ నుంచి నగరంలోని మారిస్ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో నిర్వహించిన గాంధీ బునకర్ జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన మంగళవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా నేతన్నలకే ఆర్థిక మేలు కలగ జేయాలన్న ఉద్దేశించి ఈ ప్రదర్శన నిర్వహించామన్నారు. తమ లక్ష్యం నెరవేరిందన్నారు.
14 రోజుల పాటు రోజుకు 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల మేర అమ్మకాలు జరిగాయని చెప్పారు. మొత్తంగా రూ.20 కోట్ల అమ్మకాలు జరగడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల్లో చేనేత వస్త్రాల పట్ల ఆదరణ పెరిగిందన్నారు.
ప్రజలంతా నేతన్నలకు అండగా ఉండాలని, వారానికి ఒకరోజు ప్రజలంతా చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ చేనేత మేళాను ప్రారంభించడంతో పాటు భువనమ్మ కోసం రెండు చీరలు కొనుగోలు చేయడంతో వస్త్ర ప్రదర్శనకు విపరీతమైన ప్రచారం లభించిందన్నారు.