రేవంత్ రెడ్డి కామెంట్స్ ఆర్ఎస్పీ సీరియస్
ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో సీఎం ఉండాల్సింది
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పై అనుచిత కామెంట్స్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
సీఎం సచివాలయంలో ఉండాల్సిన వ్యక్తి కాదని ఎర్రగడ్డ మానసిక రోగ చికిత్సాలయంలో ఉండాలని షాకింగ్ కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి కొలువు తీరాక పూర్తిగా తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం వికృత పదకోశం నుండి జాలువారుతున్న ఆణిముత్యాలను చూసి తన్మయత్వంలో మునిగి వేదిక పైన కూర్చుని నవ్వుతున్న కాంగ్రేసు నాయకులను చూస్తే జాలేస్తున్నదని ఎద్దేవా చేశారు ఆర్ఎస్పీ.
రేవంత్ రెడ్డి బూతు పురాణాన్ని బలవుంతంగా వింటూ బందీలై అమాయకంగా అయిష్టంగా చప్పట్లు కొడుతున్న చిన్నారి బిడ్డల భవిష్యత్ పట్ల ఆందోళన కలుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకుల కొమ్ముకాసిన నేటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఆ తల్లి ఒప్పుకుంటదా అని ప్రశ్నించారు.
అసలు కేసీఆర్ మలి దశ ఉద్యమానికి ఊపిరి పోయక పోతే, పోరాడి ఉండక పోతే తెలంగాణ వచ్చేదా అని నిలదీశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.