జగన్ హయాంలో పెరిగిన క్రైం రేట్
హోం శాఖపై చంద్రబాబు సమీక్ష
అమరావతి – రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. బుధవారం సచివాలయంలో హోం శాఖ పై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
2014-19తో పోల్చితే 2019-24 మధ్య క్రైం రేటు 46. 8 శాతం పెరిగిందని వివరించిన అధికారులు. మహిళలపై నేరాలు 36 శాతం, పిల్లలపై క్రైం 152 శాతం, మిస్సింగ్ కేసెస్ 84 శాతం, సైబర్ క్రైం నేరాలు 134 శాతం పెరిగిందంటూ తెలిపారు.
విషయం తెలిసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ్చర్యానికి గురయ్యారు. గత వైసీపీ పాలనలో పూర్తిగా నేరాలు, ఘోరాలు పెరిగి పోవడం దారుణమన్నారు. ఇక నుంచి లా అండ్ ఆర్డర్ పూర్తిగా నియంత్రణలోకి రావాలని స్పష్టం చేశారు సీఎం.
ప్రధానంగా బాలికలు, యువతులు, మహిళల భద్రతపై ఎక్కువగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. పోలీసులకు అవసరమైన మౌలిక సదుపాయలను కల్పించడం జరుగుతుందన్నారు.