NEWSANDHRA PRADESH

ఆళ్ల‌కు సుప్రీం షాక్ చంద్ర‌బాబుకు ఊర‌ట

Share it with your family & friends

ఓటుకు నోటు కేసులో కీల‌క తీర్పు ప్ర‌క‌ట‌న

ఢిల్లీ – భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది టీడీపీ చీఫ్ , ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు. బుధ‌వారం ఆయ‌న‌పై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది.

ఇదిలా ఉండ‌గా వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. చంద్ర‌బాబు నాయుడు అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డాడ‌ని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్క‌య్యాడ‌ని, ఆయ‌న‌ను నిందితుడిగా చేర్చాల‌ని, ఏపీని కాపాడాల‌ని కోరారు. ఈ మేరకు కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి.

ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. ఈ కేసు ద‌ర్యాప్తును సీబీఐకి అప్ప‌గించాల‌ని రెండు పిటిష‌న్లు దాఖ‌లు చేసిన ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలని,ఈ కేసు దర్యాప్తును సిబిఐ అప్పగించాలని వేసిన రెండు పిటిషన్లను డిస్మిస్ చేసింది ధ‌ర్మాస‌నం.

రాజకీయ కక్ష సాధింపులకు న్యాయ స్థానాన్ని వేదికగా చేర్చుకో వద్దంటూ పిటిషన్ రామకృష్ణ రెడ్డిని హెచ్చరించారు జస్టిస్ సుందరేష్ . ఆళ్ళ రామకృష్ణ రెడ్డి పిటిషన్ కొట్టి వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది సుప్రింకోర్టు.