జన్వాడ ఫాం హౌస్ కూల్చొద్దు – హైకోర్టు
అన్ని చూశాకే ముందుకు అడుగు వేయండి
హైదరాబాద్ – జన్వాడ ఫాం హౌస్ ను కూల్చొద్దంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బుధవారం కీలక ప్రకటన చేసింది. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా హైదరాబాద్ లో హల్ చల్ చేస్తోంది. అక్రమ కట్టడాలను, నిర్మాణాలను ప్రతి రోజూ కూల్చేస్తోంది. ముందస్తుగా నోటీసులు ఇవ్వడం, అవి ఆక్రమణలు అని తేలితే వెంటనే అక్కడ వాలి పోవడం, నేల మట్టం చేయడం జరుగుతోంది. దీంతో వ్యాపారస్తులు, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
మొన్నటికి మొన్న ఎంఐఎం ఎమ్మెల్యేకు చెందిన ఇంటిని కూల్చేసింది. దీంతో ఎవరిపై ఎప్పుడు హైడ్రా దాడి చేస్తుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ తరుణంలో ఉన్నట్టుండి బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి కేటీఆర్ దిగా భావిస్తున్న జన్వాడ ఫాం హౌస్ ను కూడా హైడ్రా కూల్చేసేందుకు రెడీ కానుందని ప్రచారం జరిగింది.
దీంతో బీఆర్ఎస్ నేతలు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. తమ ఫాం హౌస్ ను కూల్చ వద్దని కోరారు. దీనిపై విచారించిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాతనే అడుగు వేయాలని స్పష్టం చేసింది.
అంతే కాకుండా జీవో నెంబర్ 99 ప్రకారం రూల్స్ ప్రకారం నడుచు కోవాలని పేర్కొంది.