24న మరాఠా బంద్ కు పిలుపు – రౌత్
బద్లాపూర్ ఘటనపై సీరియస్ కామెంట్
మహారాష్ట్ర – శివసేన యుబీటీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సీరియస్ కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము సీట్ల పంపకం గురించి చర్చించేందుకు వచ్చామని, కానీ అనుకోకుండా దాని గురించి మాట్లాడ లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బద్లాపూర్ సంఘటన తర్వాత శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు సంజయ్ రౌత్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. లా అండ్ ఆర్డర్ ను కాపాడటంలో ఏక్ నాథ్ షిండే సంకీర్ణ సర్కార్ ఘోరంగా విఫలం అయ్యిందని ఆరోపించారు ఎంపీ.
విచిత్రం ఏమిటంటే బద్లాపూర్ ఘటనకు సంబంధించి నిరసన తెలిపిన వారిపై పోలీసులు దాడి చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇదే సమయంలో న్యాయం కోసం ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేస్తారా అంటూ నిలదీశారు సంజయ్ రౌత్.
బద్లాపూర్ సంఘటనపై మహారాష్ట్ర వికాస్ అఘాడీ (ఎంవీఏ) ఈనెల 24వ తేదీన మహారాష్ట్ర బంద్ కు పిలుపు ఇచ్చిందని ప్రకటించారు. ఈ బంద్ కు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.