అచ్యుతాపురం ఘటన బాధాకరం – కొండపల్లి
ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది
అమరావతి – ఏపీలోని విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలిన ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ రాష్ట్ర సూక్ష్మ, చిన్న ,మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతో ఫోన్లో మాట్లాడారు. ఘటన నేపథ్యంలో ప్రజలు భయ భ్రాంతులకు గురి కాకుండా,శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని కొండపల్లి శ్రీనివాస్ కోరారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పారు. పరిశ్రమల శాఖ అధికారులు అక్కడే ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన ఆదేశించారు.
విజయవాడలో ఉన్న మంత్రి శ్రీనివాస్ ఘటన నేపథ్యంలో సహాయక చర్యలలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు హుటాహుటిన అత్చుతాపురం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్బంగా ఇవళ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు. మెరుగైన వైద్య సాయం అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఏపీ వైద్య, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.