ENTERTAINMENT

జై చిరంజీవ సుఖీభ‌వ

Share it with your family & friends

మెగా స్టార్ పుట్టిన రోజు

హైద‌రాబాద్ – తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రారాజుగా వెలుగొందుతున్న ప్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఇవాళ‌. ఎవ‌రి స‌హ‌కారం లేకుండానే స్వ‌శ‌క్తితో పైకి వ‌చ్చారు. లక్ష‌లాది మంది అభిమానుల‌ను క‌లిగి ఉన్నారు.

ఆయ‌న వ‌య‌సు 49 ఏళ్లు. పేరెంట్స్ అంజ‌నాదేవి, వెంక‌ట్ రావు. భార్య సురేఖ. త‌మ్ముళ్లు నాగ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ . ఇద్ద‌రు కూతుళ్లు సుస్మిత‌, శ్రీ‌జ‌, కొడుకు రామ్ చ‌ర‌ణ్. అత్యున్న‌త‌మైన ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాన్ని పొందారు. త‌న సినీ కెరీర్ లో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. మరెన్నో ప్ర‌శంస‌లు, పుర‌స్కారాలు అందుకున్నారు. వ‌య‌సు మీద ప‌డినా ఇంకా న‌టిస్తూనే ఉన్నారు.

కొత్త త‌రం న‌టుల‌తో పోటీగా త‌ను కూడా సినిమాల‌లో యాక్టింగ్ చేయ‌డం విశేషం. రాజ‌కీయాల‌లోకి ప్ర‌వేశించాడు. స్వంతంగా ప్ర‌జా రాజ్యం పార్టీ పెట్టాడు. ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. కేంద్ర మంత్రిగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత కొంత కాలం దూరంగా ఉంటూ వ‌చ్చారు. ప్ర‌స్తుతం త‌న సోద‌రుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీకి ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్నారు.

బ్రేక్ డ్యాన్సుల‌కు పేరు పొందారు చిరంజీవి. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు త‌న సినీ కెరీర్ లో ఏకంగా 150కి పైగా సినిమాల‌లో న‌టించారు. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని సినిమాల‌లో న‌టించాల‌ని, పుర‌స్కారాలు, అవార్డులు అందుకోవాల‌ని ఆశిద్దాం.