నటుడు తళపతి విజయ్ కొత్త పార్టీ ప్రకటన
తమిళగ వెట్రి కజం పార్టీగా నామ కరణం
తమిళనాడు – తమిళనాడు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ పుట్టుకు వచ్చింది. ప్రముఖ నటుడు తళపతి విజయ్ సంచలన ప్రకటన చేశారు. గురువారం ఆయన కొత్త పార్టీ పెడుతున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని చెన్నై వేదికగా ఈ విషయం తెలిపారు.
ఈ సందర్బంగా తాను రాజకీయాలలోకి వస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు తమిళ సూపర్ స్టార్ గా పేరు పొందిన తళపతి విజయ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలో వచ్చే 2026 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు విజయ్.
తమ పార్టీ పేరును కూడా వెల్లడించారు. తమిళగ వెట్రి కజగం (టీవీకే) అని పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించి అధికారికంగా ఆవిష్కిరంచారు జెండాను.
ఇదిలా ఉండగా తమిళనాడు రాష్ట్రంలో పలువురు సినీ రంగానికి చెందిన నటీ నటులు ఇప్పటికే పార్టీలు పెట్టారు. వారిలో జయలలిత, విజయ కాంత్ , కమల్ హాసన్ , కరుణా నిధి ఉన్నారు. ప్రస్తుతం వారి సరసన తళపతి విజయ్ కూడా చేరారు.
ఆయన గతంలో మెర్సిల్ సినిమా ద్వారా తనలోని భావాలను ప్రకటించారు. కొంత కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు తళపతి విజయ్. రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి.