మోడీ రాచరిక పాలన సాగదు – టికాయత్
ప్రధానమంత్రిపై రైతు నేత ఆగ్రహం
ఉత్తర ప్రదేశ్ – రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయత్ నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలు మోడీ రాచరిక పాలన పట్ల ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఆయన పాలన ప్రస్తుతం ఆనాటి హిట్లర్ ను తలపింప చేస్తోందని ధ్వజమెత్తారు.
కేవలం కొందరికి మాత్రమే ప్రయారిటీ ఇస్తూ దేశ వనరులను, సంపదను కొల్లగొట్టే వారికి అందలం ఎక్కించేందుకు ప్రయత్నం చేయడం దారుణమన్నారు రాకేశ్ టికాయత్. ఇవాళ దేశంలోని అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .
ప్రస్తుతం నల్ల చట్టాలను తీసుకు వచ్చి ప్రజలపై మరింత రుద్దాలని ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు రాకేశ్ టికాయత్. మరోసారి రైతు ఉద్యమం రాక తప్పదన్నారు. ఆనాడు 25 లక్షల మందితో పార్లమెంట్ ను ముట్టడించి ఉంటే పరిస్థితి ఇందాకా వచ్చి ఉండేది కాదన్నారు రైతు ఉద్యమ నాయకుడు.
ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగిస్తూ పోతే చివరకు భారత దేశం కూడా మరో బంగ్లాదేశ్ లాగా తయారుకాక తప్పదని హెచ్చరించారు రాకేశ్ టికాయత్.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజలు నాగ్‌పూర్‌కు పారి పోతారనే భ్రమలో ఉండకూడదని పేర్కొన్నారు.