NEWSTELANGANA

రైతుల రుణ మాఫీ బ‌క్వాస్ – కేటీఆర్

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డి మాట‌లు అబ‌ద్దాలు

రంగారెడ్డి జిల్లా – రాష్ట్రంలోని రైతుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 2 ల‌క్ష‌ల రుణాలు మాఫీ పూర్తిగా కాలేద‌ని ఆరోపించారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం బీఆర్ఎస్ పార్టీ బాస్ కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధ‌ర్నా చేప‌ట్టారు. అంత‌కు ముందు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల‌లో కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న తెలిపారు. భారీ ర్యాలీ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా కేటీఆర్ ప్ర‌సంగించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌లో ఒక్క‌టి కూడా పూర్తి కాలేద‌న్నారు. ఒక్క ఉచిత బ‌స్సు ప‌థ‌కం త‌ప్పా ఏది పూర్తి చేశారో చెప్పాల‌ని ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. రాష్ట్రంలో రుణాలు తీసుకున్న రైతుల‌కు మాఫీ చేయాలంటే క‌నీసం రూ. 48 వేల కోట్లు కావాల్సి ఉంటుంద‌న్నారు.

కానీ ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం కేవ‌లం రూ. 17 వేల కోట్లు మాత్ర‌మే చెల్లించామ‌ని చెబుతోంద‌న్నారు. ఏం సాధించార‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని మండిప‌డ్డారు కేటీఆర్. రైతులు రోడ్ల మీద‌కు వ‌చ్చార‌ని, వారికి స‌మాధానం చెప్పాల్సిన బాధ్య‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఉంటుంద‌న్నారు . లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

త‌మ ఆందోళ‌న శాంపిల్ మాత్ర‌మేన‌ని, త్వ‌ర‌లో అస‌లైన ఆందోళ‌న అంటే ఏమిటో చూపిస్తామ‌ని అన్నారు కేటీఆర్.