మహిళా జర్నలిస్టులపై దాడి దారుణం
ఖండించిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ – రైతులకు సంబంధించి రుణాలు మాఫీ అయ్యాయో లేదోనని తెలుసుకునే ప్రయత్నం చేసిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయా రెడ్డిపై కొండారెడ్డిపల్లిలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీశ్ రావు.
కొండారెడ్డిపల్లి ఏమైనా నిషేధిత ప్రాంతమా అని మండిపడ్డారు . ఇది ప్రజా పాలన కాదని గొంతులను నొక్కిసేందుకు ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు హరీశ్ రావు.
రుణమాఫీపై వాస్తవాలు తెలుసు కునేందుకు వెళ్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం ఎందుకు అని నిలదీశారు. మహిళా జర్నలిస్టులను చుట్టు ముట్టడమే కాకుండా, ఫోన్లు, కెమెరాలు లాక్కుని, చిప్స్ ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేయడం దారుణమన్నారు. అంతే కాకుండా దాడి చేసి..బెదిరించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు తన్నీరు హరీశ్ రావు.
దాడికి పాల్పడిన వారిని భేషరతుగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు.