ప్రజా పాలన కాదు అరాచక పాలన
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కాగజ్ నగర్ – బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజా పాలన కాదని అరాచక పాలన సాగుతోందన్నారు. రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. పార్టీ ఆదేశాల మేరకు గురువారం సంపూర్ణ రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్బంగా ర్యాలీని ఉద్దేశించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగించారు. రుణ మాఫీ చేయమని అడిగిన పాపానికి రైతుల మీద అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం కాదు రాక్షస ప్రభుత్వం నడుస్తోందని మండిపడ్డారు.
రుణ మాఫీ గురించి ఆరా తీస్తే, వాస్తవాలు తెలియ చేసేందుకు ప్రయత్నం చేసేందుకు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరిత, విజయా రెడ్డిలపై దాడి చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యకత్ం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
రైతులందరికి రుణమాఫీ చేయాలని ప్రతిపక్ష పార్టీ పోరాటం చేస్తే.. వాళ్ల మీద దౌర్జన్యాలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తనకు పాలన చేత కాక ఇతరుల మీద రాళ్లు వేస్తున్నారంటూ సీఎంపై మండిపడ్డారు.