దేశంలోని వనరులన్నీ సమానంగా అందాలి
పిలుపునిచ్చిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా
అమెరికా – అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన దేశ అధ్యక్ష ఎన్నికలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో అమెరికా వైపు చూస్తోందని చెప్పారు బరాక్ ఒబామా.
ఓ వైపు ఉగ్రవాదం పేట్రేగి పోతోందని, మనుషలకు భద్రత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికీ బతికే హక్కు ఉంటుందని అన్నారు. దానిని ఎవరూ అడ్డుకోరాదని కోరారు.
అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు జరిగేందుకు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. మన దేశ భవిష్యత్తును నిర్దేశించే కీలకమైన తీర్పు మీ చేతుల్లోనే ఉందన్నారు బరాక్ ఒబామా. మన దేశానికి ఈ సమయం అత్యంత కీలకమైనది. ఎందుకంటే మన భవిష్యత్తును మనమే నిర్దేశించుకునే ఎన్నికలు ఇవి.అత్యంత విజ్ఞతతో ఆలోచించి మీ తీర్పు వెలువరించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు బరాక్ ఒబామా.
”దేశ అధ్యక్షుడు బైడన్, ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ తో పాటు నా కుటుంబానికి చెందిన పిల్లలు చదువుకుంటున్న బడులకు మీ పిల్లలు కూడా వెళ్లాలి. నాకు అందుతున్న వైద్య సౌకర్యాలు మీకు కూడా అందాలి. మా పిల్లలు చేస్తున్న జాబ్స్ మీ పిల్లలకు కూడా రావాలి. నాకున్న అవకాశాలు మీకు కూడా ఉండాలి. ఈ దేశంలో ఉన్న వనరులన్నీ ప్రతీ ఒక్కరికి సమానంగా అందాలి. సమాన అవకాశాలు కల్పించడమే రాజకీయ నాయకుడి ప్రథమ విధి అయి ఉండాలి. అది జరిగిన రోజే ఆర్థిక అభివృద్ది దానంతట అదే పురోభివృద్ది చెందుతుందని అన్నారు బరాక్ ఒబామా.”