కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయండి
ఎమ్మెల్సీలకు కేటీఆర్ దిశా నిర్దేశం
హైదరాబాద్ – ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేయాలని, ఎప్పటికప్పుడు సమస్యలను ప్రస్తావించేందుకు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల పై చట్ట సభలు అసెంబ్లీ, శాసన మండలిలో ప్రస్తావించాలని సూచించారు.
ప్రజలు ఏం కోల్పోయారనేది వారికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించి పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు పూర్తిగా ఆయా అంశాలకు సంబంధించి అవగాన కలిగి ఉండాలని సూచించారు కేటీఆర్.
హామీలను తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ సర్కార్ చేస్తోందని దీనిని ఎండగట్టాలని అన్నారు. ఎమ్మెల్సీలు పార్టీకి కళ్లు, చెవులు అని స్పష్టం చేశారు . ఆయా మండలి సభ్యులు నియోజకవర్గాలలో ప్రజా ప్రతినిధులతో కలిసి సమన్వయం చేసుకోవాలని చెప్పారు. లేక పోతే ఇబ్బందులు తప్పవన్నారు.
పార్టీని గ్రామ స్థాయి నుంచి పోలిట్ బ్యూరో వరకు పార్టీని పునర్యవస్థీకరించాలని పార్టీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారని అన్నారు. సమర్థవంతమైన నాయకత్వం మనకు ఉందన్నారు. కార్యకర్తలు, నాయకుల సేవలను పార్టీ తప్పకుండా ఉపయోగించు కుంటుందన్నారు.