ఉత్తమ సీఎంల జాబితాలో చంద్రబాబు
ఆజ్ తక్ – సీ ఓటర్ ..మూడ్ ఆఫ్ ది నేషన్
ఢిల్లీ – తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చనీయాంశంగా మారింది. స్కిల్ స్కామ్ కేసులో గత జగన్ మోహన్ రెడ్డి బాబును అరెస్ట్ చేసింది. చివరకు ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. రాష్ట్రంలో ఊహించని రీతిలో విస్తృతంగా పర్యటించారు. వైసీపీ దమనకాండ, గాడి తప్పిన పాలనపై విమర్శల బాణాలు సంధించారు. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో నిలబడ్డారు. ఊహించని రీతిలో 175 సీట్లకు ఏకంగా కూటమి 164 సీట్లను కైవసం చేసుకుంది.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు నారా చంద్రబాబు నాయుడు. సీఎంగా సంతకం చేసిన నాటి నుంచి నేటి దాకా వయసు మీద పడుతున్నా లెక్క చేయకుండా రాష్ట్ర అభివృద్ది కోసం ఫోకస్ పెట్టారు. కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రపంచ బ్యాంకుతో పాటు ఏడీబీ, పారిశ్రామికవేత్తలు, కంపెనీల చైర్మన్లు, సీఈవోలు, ఎండీలతో పాటు పెట్టుబడిదారులను తమ రాష్ట్రానికి ఆహ్వానించారు.
భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు. అంతే కాకుండా పాలనా పరంగా తనదైన ముద్ర వేశారు నారా చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా జాతీయ స్థాయిలో పేరు పొందిన ఆజ్ తక్ ఛానల్ తాజాగా దేశ వ్యాప్తంగా సర్వే చేపట్టింది. దేశంలో అత్యుత్తమ సీఎంలు ఎవరనేది జాబితా రూపొందించింది. తొలి స్థానంలో యూపీ సీఎం యోగి తొలి స్థానంలో ఉండగా , నాల్గో స్థానంలో చంద్రబాబు నాయుడు నిలిచారు.