400 చైనా కంపెనీలపై కేంద్రం నిషేధం
17 రాష్ట్రాలలో సంస్థలపై బిగ్ షేక్
ఢిల్లీ – మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాకు బిగ్ షాక్ ఇచ్చింది. మొత్తం చైనాకు చెందిన 400 కంపెనీలపై వేటు వేసింది. దేశంలోని 17 రాష్ట్రాలలో వీటిని నిర్వహించకుండా నిషేధం విధించింది. ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన చేసింది కేంద్రం.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వులలో పేర్కొంది బీజేపీ సర్కార్. ఇదిలా ఉండగా 400 చైనీస్ కంపెనీలు ఆన్ లైన్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసినట్లు గుర్తించింది కేంద్రం. ఇదే సమయంలో ఆన్ లైన్ లో రుణాలు ఇస్తామంటూ పెద్ద ఎత్తున సంస్థలు, కంపెనీలు, యాప్ లు నిట్ట నిలువునా ఇబ్బందులకు గురి చేశాయని ఆరోపించింది.
భారీ ఎత్తున చైనాకు చెందిన కంపెనీల వ్యవహారం, మోసంపై సీరియస్ అయ్యింది కేంద్రం. ఈ కంపెనీలన్నీ మోసానికి పాల్పడినట్లు విచారణలో గుర్తించింది. చాలా కంపెనీలకు సంబంధించి పూర్తి చిరునామాలు లేక పోవడం కూడా వెలుగు చూసినట్లు కేంద్రం తెలిపింది.
ఇప్పటికే భారత్, చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్ఙితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోవడంతో చైనా సర్కార్ కు గట్టి దెబ్బ తగిలినట్లయింది.