గ్రామ స్వరాజ్యం అభివృద్దికి సోపానం
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అన్నమయ్య జిల్లా – దేశ అభివృద్దిలో గ్రామాలు కీలకం వహిస్తాయని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కణిదెల. గ్రామ పంచాయతీలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం టీడీపీ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో గ్రామ సభలకు శ్రీకారం చుట్టింది.
గ్రామ స్థాయి నుంచి దేశ భక్తి రావాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. తమ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అభివృద్దికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. స్వర్ణ గ్రామాల అభివృద్ది చేయడం తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సినిమాలను, రాజకీయాలను వేర్వేరుగా చూస్తానని చెప్పారు. అన్నం పెట్టే రైతులు బాగుండాలని కోరుకుంటానని, వారు బాగుంటేనే మనం బాగుంటామని అన్నారు.
గ్రామాలు పచ్చదనంతో ఉంటే దేశం పచ్చదనంతో ఉంటుందన్నారు. గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలు చాలా కీలకంగా వ్యవహరిస్తాయని అన్నారు పవన్ కళ్యాణ్ కొణిదెల.
పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలతో పాటుగా, ఒకే రోజు 13,326 చారిత్రాత్మక గ్రామసభల మహా ఉద్యమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.
4,500 కోట్ల రూపాయిల నిధులతో 87 రకాల పనులతో, గ్రామాలు అభివృద్ధి చెందేలా, 9 కోట్ల పని దినాలతో, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.