సర్కార్ స్పందించిన తీరు బాధాకరం
సంచలన కామెంట్స్ చేసిన జగన్ రెడ్డి
అమరావతి – ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా అచ్యుతాపురం సెజ్ లో చోటు చేసుకున్న ఘటనలో గాయపడి ఉషా ప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షత గాత్రులను పరామర్శించారు జగన్ రెడ్డి.
అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత కలిగిన ప్రభుత్వం సరైన సమయంలో స్పందించ లేక పోయిందని మండిపడ్డారు.
ఇది తనను మరింత బాధకు గురి చేసిందన్నారు.. తమ హయాంలో ఇలాంటి ఘటనే జరిగితే వేగంగా స్పందించామని గుర్తు చేశారు. 24 గంటల్లోనే రూ. కోటీ పరిహారం ప్రకటించిన ఘనత వైసీపీదే అని జగన్ చెప్పారు ప్రమాదం జరిగినా.. వైసీపీపై నింద వేయడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు.
ఇంకా ఎంత కాలం తమపై ఆరోపణలు చేస్తూ పాలన సాగిస్తారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. ఇలాంటి కామెంట్స్ మంచివి కావని సూచించారు జగన్ మోహన్ రెడ్డి. ఇకనైనా సీఎం మారాలని హితవు పలికారు.