నారా లోకేష్ ప్రజా దర్బార్
30వ రోజుకు చేరుకున్న దర్బార్
అమరావతి – ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కు జనం పోటెత్తారు. శుక్రవారం ఆయన తాను ఉంటున్న ఉండవల్లి నివాసంలో దర్బార్ ను నిర్వహించారు. ఇవాల్టితో లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ 30 రోజులకు చేరుకుంది.
మంగళగిరి నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు విన్నవించారు. సమస్యలను ఆయా విభాగాలకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు నారా లోకేష్..
ఇదిలా ఉండగా ఓ వైపు మంత్రిగా బిజీగా ఉంటూనే మరో వైపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారు ఏపీ విద్యా, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి . ఆయన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ వస్తున్నారు.
ఇవాళ వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా వైసీపీ హయాంలో జరిగిన ఆక్రమణలు, కబ్జాలతో భూ వివాదాలకు సంబంధించినవి వచ్చాయి.