కార్మికుల పట్ల వివక్ష తగదు – ఆర్ఎస్పీ
లేబర్ కమిషనర్ కు వినతి పత్రం
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిర్పూర్ పేపర్ మిల్లులో గత ఆరు సంవత్సరాలు గా లేబర్ యూనియన్ ఎన్నికలు జరగడం లేదని ఆరోపించారు. లేబర్ రూల్స్ వర్తింప చేయక పోవడం దారుణమన్నారు.
కొత్తగా వచ్చిన జేకే ఇండస్ట్రీస్ కార్మికుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తక్షణమే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.
స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా జోక్యం చేసుకోవాలని స్పష్టం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. శుక్రవారం కార్మిక నాయకులతో సహా లేబర్ కమిషనర్ క్రిష్ణ ఆదిత్య, జాయింట్ కమిషనర్ సునీతలను కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వినతి పత్రం సమర్పించారు.
వెంటనే చర్యలు తీసుకోవాలని, లేక పోతే తాము కార్మికుల తరపున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఆర్ఎస్పీ. ఏ కంపెనీ లేదా సంస్థ అయినా కార్మిక శాఖ నియమ నిబంధనలు పాటించాల్సిందేనని, మరి ఎందుకు ఎన్నికలు జరపడం లేదో చెప్పాలని కోరారు.