బెంగాల్ నటి పాయెల్ ముఖర్జీపై దాడి
మహిళా సీఎం హయాంలో రక్షణ కరువు
కోల్ కతా – ప్రముఖ బెంగాల్ నటి పాయెల్ ముఖర్జీపై దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగుడు ఆమె కారుపై దాడి చేసేందుకు యత్నించాడు. దాడి చేయడమే కాకుండా తన కారు కిటికీని ధ్వంసం చేశాడని నటి పాయెల్ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
తనపై దాడికి పాల్పడిన దుండగుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాయెల్ ముఖర్జీ డిమాండ్ చేసింది. తనను చంపేందుకు ప్లాన్ చేశారని తేలి పోయిందన్నారు బాధితురాలు. ఒకవేళ తాను గనుక కారులో లేకుండా ఉండి ఉంటే తనను చంపే వాడని వాపోయింది .
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది పాయెల్ ముఖర్జీ. ఇప్పటికే కోల్ కతా ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ కు గురైనా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదంటూ నటి ఆరోపించింది.
ఈ సందర్బంగా నటి పాయెల్ ముఖర్జీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ సీఎంగా ఉన్నా మహిళలకు సెక్యూరిటీ లేక పోవడం ఎంత బాధాకరమని వాపోయింది.