SPORTS

జే షాకు లైన్ క్లియ‌ర్

Share it with your family & friends

క్రికెట్ వ‌ర్గాల ధ్రువీక‌ర‌ణ

హైద‌రాబాద్ – ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మ‌న్ గా ఉన్న గ్రెగ్ బార్ క్లే ప‌ద‌వీ కాలం త్వ‌ర‌లో ముగియ‌నుంది. ఎవ‌రు త‌ర్వాతి స్థానంలో ఉంటార‌నే దానిపై ఉత్కంఠ‌కు తెర ప‌డ‌నుంది. ప్ర‌పంచ క్రికెట్ రంగంలో ప్ర‌స్తుతం భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) కీల‌క పాత్ర పోషిస్తోంది. అత్య‌ధిక ఆదాయం క‌లిగిన క్రీడా సంస్థ‌గా పేరు పొందింది.

ప్ర‌స్తుతం ఐసీసీ చైర్మ‌న్ రేసులో జే షా ఉన్నారు. ఆయ‌న‌కు ఇంగ్లండ్ , ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నాయి. చైర్మ‌న్ ను ఎన్నుకునేందుకు మొత్తం 16 మంది డైరెక్ట‌ర్లు ఉన్నారు. వీరిలో అత్య‌ధిక మంది బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షాకు మ‌ద్ద‌తు ఇస్తుండ‌డం విశేషం.

ప్ర‌స్తుతం బీసీసీఐకి కార్య‌ద‌ర్శితో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ ) చైర్మ‌న్ గా ఉన్నారు జే షా. గ్రెగ్ బార్ క్లే త‌ర్వాత జే షాకు ద‌క్క‌డం ఖాయ‌మ‌ని క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అయితే చైర్మ‌న్ ప‌ద‌వికి సంబంధించి ఓటింగ్ కాకుండా ఏక‌గ్రీవంగా ఎన్నుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు స‌మాచారం. మొత్తంగా జే షా చేతికి ఐసీసీ ద‌క్కితే భారీ ఎత్తున ఆదాయం స‌మ‌కూరే ఛాన్స్ లేక పోలేదు.