నాగార్జునకు షాక్ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
హైదరాబాద్ లో తగ్గేదే లేదంటున్న హైడ్రా
హైదరాబాద్ – హీరో అక్కినేని నాగార్జునకు బిగ్ షాక్ తగిలింది. మాదాపూర్ లో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చి వేసే పనిలో పడింది రంగనాథ్ నేతృత్వంలోని హైడ్రా. ఇప్పటికే అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
సినిమా నటుడిగా, యాంకర్ గా, హోస్ట్ గా పేరు పొందిన అక్కినేని నాగార్జున గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కొలువు తీరిన అన్ని ప్రభుత్వాలను మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ కన్వెన్షన్ పై కన్నెర్ర చేసింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ మిన్నకుండి పోయారు. నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ మంచి దోస్తులుగా మారి పోయారు.
తాజాగా రాష్ట్రంలో కొత్తగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది. ఆయనను కూడా అక్కినేని నాగార్జున కలిశారు. అయితే ప్రభుత్వ చెరువులను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. హైదరాబాద్ చుట్టూ ఆకాశ హార్మ్యాలు దర్శనం ఇస్తున్నాయి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నిర్మాణ రంగ సంస్థలు రాజ్యం ఏలుతున్నాయి.
శనివారం హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చి వేశారు హైడ్రా అధికారులు. తమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు అందింది.