NEWSNATIONAL

కేజ్రీవాల్ పై విచారణ‌కు సీబీఐకి ఓకే

Share it with your family & friends

అనుమ‌తి ఇచ్చిన సుప్రీంకోర్టు

ఢిల్లీ – ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసుకు సంబంధించి తీహార్ జైలులో ఉన్న ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ త‌గిలింది. శ‌నివారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ కేజ్రీవాల్ ను విచారించేందుకు అనుమ‌తి పొందింది. ఆయ‌న‌పై ఇప్ప‌టికే అనుబంధ ఛార్జిషీట్ దాఖ‌లు చేసింది.

ఈ ఛార్జిషీట్ లో తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది అర‌వింద్ కేజ్రీవాల్ పై. ఆయ‌న ఈ కేసును రాజ‌కీయంగా వాడుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్ ప్రమేయం ఉందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌. ఇదిలా ఉండ‌గా ఈ కేసులో ఇప్ప‌టికే ప‌లువురిని అరెస్ట్ చేశారు.

వీరిలో ఆప్ కు చెందిన మాజీ మంత్రితో పాటు మాజీ ఉప ముఖ్య‌మంత్రి సిసోడియా కూడా ఉన్నారు. ఈ కేసులో మ‌రో కీల‌క పాత్రధారి కూడా ప్ర‌స్తుతం కేజ్రీవాల్ తో పాటు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఉండ‌డం విశేషం.

అయితే ఇటీవ‌లే 17 నెల‌ల జైలు జీవితం అనంత‌రం మ‌ధ్యంత‌ర బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చారు మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా. మొత్తంగా కేసు కొలిక్కి తీసుకు వ‌చ్చేందుకు సీబీఐ దూకుడు పెంచ‌డం విశేషం.