NEWSANDHRA PRADESH

పైల‌ట్ ప్రాజెక్టుగా స్కిల్ సెన్స‌స్ స‌ర్వే

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన మంత్రి నారా లోకేష్

అమ‌రావ‌తి – ఏపీ విద్య‌, ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మంగ‌ళ‌గిరిలో పైలెట్ ప్రాజెక్టుగా స్కిల్ సెన్స‌స్ స‌ర్వే కోసం ఎంపిక చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

స్కిల్ సెన్సస్ సర్వేపై స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో ఉండవల్లి నివాసంలో స‌మీక్ష నిర్వ‌హించారు నారా లోకేష్‌. యువతకు చెందిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్ మెంట్, స్కిల్ ప్రొఫైల్స్‌ను స్కిల్ సెన్స‌స్‌లో క్రోడీకరిండం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెస్యూమ్ తయారు చేసిన‌ ప్రొఫెల్స్‌ని ప్రముఖ కంపెనీలకు నేరుగా యాక్సెస్ ఇస్తామ‌ని చెప్పారు నారా లోకేష్. దీని వ‌ల్ల‌ ఆయా కంపెనీలు త‌మ‌కు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకు వ‌స్తామ‌ని తెలిపారు.

ప‌రిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, యువతకు ఉద్యోగాల కల్పన..ఈ రెండు అంశాలే నైపుణ్య గణన అంతిమ లక్ష్యమ‌ని పేర్కొన్నారు నారా లోకేష్‌. త‌మ ప్రభుత్వం కొత్త‌గా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు కృషి చేస్తోంద‌ని చెప్పారు.

ప్ర‌ధానంగా నైపుణ్యాభివృద్దిపైనే దృష్టి సారించిన‌ట్లు తెలిపారు. దీని వ‌ల్ల నిరుద్యోగం అనేది ఉండ‌ద‌ని పేర్కొన్నారు.