ప్రిన్సిపాల్ ను ఎందుకు బదిలీ చేశారు..?
పశ్చిమ బెంగాల్ సర్కార్ పై సీజేఐ ఫైర్
ఢిల్లీ – కోల్ కతా ట్రైన్ డాక్టర్ రేప్ , మర్డర్ కేసుకు సంబంధించి సీరియస్ కామెంట్స్ చేశారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్. శనివారం ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగింది. ఈ సందర్బంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకని ఆర్జీ కర్ ఆస్పత్రి ప్రిన్సిపాల్ ను బదిలీ చేయాల్సి వచ్చిందంటూ సీజేఐ నిలదీశారు.
తనను అక్కడి నుంచి ఘటన జరిగిన వెంటనే ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఫైర్ అయ్యారు. అసలు ఎవరిని రక్షిస్తున్నారని..ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 గంటల ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కారణం ఏమిటి.. అంటూ మండిపడ్డారు .
అతను నేరుగా కాలేజీకి వచ్చి ఎఫ్ఐఆర్ దాఖలు చేసి ఉండాల్సింది, ఎవరిని రక్షిస్తున్నాడు..? అంటూ ఫైర్ అయ్యారు సీజేఐ. ఇదిలా ఉండగా ట్రైనీ డాక్టర్ హత్యచార కేసు లో ఈరోజు 7 గురికి పాలిగ్రఫీ టెస్ట్ సిబిఐ అధికారులు చేయనున్నారు. నిందితుడు సంజయ్ రాయ్ పై జైలులో పరీక్ష చేపడతారు. మిగతా ఆరుగురికి సీబీఐ ఆఫీసులో టెస్టులు నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు ఢిల్లీ నుంచి కోల్ కతాకు ప్రత్యేక టీంను పంపించారు.