అక్కినేని నాగార్జునకు కోర్టు బిగ్ రిలీఫ్
కూల్చివేతలు ఆపాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ – అక్కినేని నాగార్జునకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. తనకు చెందిన ఎన్ – కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్పందించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే దీనిపై కోర్టు స్టే విధించినా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హైడ్రా ధ్వంసం చేయడాన్ని తప్పు పట్టారు పిటిషనర్. ప్రస్తుతానికి ఎలాంటి కూల్చివేతలు చేపట్ట వద్దంటూ కోర్టు స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడ లేదంటూ స్పష్టం చేశారు అక్కినేని నాగార్జున. పూర్తిగా అది ప్రైవేట్ భూమి అని, పర్మిషన్ ఇవ్వడంతో కట్టడం చేశామని తెలిపారు. అయితే హైడ్రా మాత్రం కీలక ప్రకటన చేసింది. పూర్తిగా 3 ఎకరాలకు పైగా ఆక్రమించాడని, ఇది తమ్మిడి కుంట చెరువుకు సంబంధించినదని వెల్లడించింది.
2 ఎకరాలు బఫర్ జోన్ లో ఉండగా మరో 1. 12 ఎకరాలు చెరువు శిఖం కింద (ఫుల్ ట్యాంక్ లెవల్ – ఎఫ్టీఎల్) కు వస్తుందని తెలిపింది. అయితే చెరువును ఎవరూ ఆక్రమించకుండా 2 ఎకరాలను బఫర్ జోన్ గా పెడతారు. దానిని కూడా నాగార్జున ఆక్రమించాడని ఆరోపించింది. అందుకే కూల్చామంటూ స్పష్టం చేసింది.