ఫోన్ ట్యాపింగ్ కేసు లో దర్యాప్తు వేగం – సీపీ
స్పష్టం చేసిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ – హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. కేసుకు సంబంధించి కీలక నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు సీపీ.
ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయాలని సిబిఐ డైరెక్టర్ ని కోరామని వెల్లడించారు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. సిబిఐ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన తర్వాత నిందితులను త్వరగా ఇండియాకి తీసుకు వస్తామని అన్నారు.
బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయాలని అనుకున్నట్లు తెలిపారు సీపీ. కానీ బ్లూ కార్నర్ నోటీస్ తో యు ఎస్ గవర్నమెంట్ వ్యక్తులని మనకి హ్యాండ్ ఓవర్ చేయరని పేర్కొన్నారు .
కాబట్టి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సిబిఐ డైరెక్టర్ కి విన్నవించడం జరిగిందన్నారు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. సిబీఐ డైరెక్టర్ కి కేసు పూర్తి వివరాలు అందజేశామన్నారు. ఇదే సమయంలో ఈ కేసుకు సంబంధించి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తామని చెప్పారు.