అనంతబాబు నిర్వాకం శిరీష దేవి ఆగ్రహం
అక్రమాలే కాదు మహిళలపై వేధింపులు
అమరావతి – తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే శిరీష దేవి నిప్పులు చెరిగారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీ బాస్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో అక్రమార్కులే కాదు వేధింపుల పర్వానికి పరాకాష్టగా మారారంటూ ఆరోపించారు.
జగన్ ప్రియ శిష్యుడు , వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై రంప చోడవరం ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. అనంతబాబు పలు అక్రమాలకు పాల్పడటమే కాదు, మహిళలను వేధించాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా ఉద్యోగులను లైంగిక ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించారు శిరీష దేవి. అడ్డంగా దొరికిపోయి మార్ఫింగ్ వీడియో అంటూ బుకాయిస్తున్నాడని మండిపడ్డారు. అనంతబాబు ఇలాంటి వాడని, ఏజెన్సీలో అందరికీ తెలుసన్నారు.
ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది మహిళలని లైంగికంగా వేధించాడని ఆరోపించారు. అనంతబాబుకు ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధాన్ని బయట పెడతాడన్న అనుమానంతోనే నాడు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపాడని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే శిరీషా దేవి.