ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు ఉండదు
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కామెంట్
ఢిల్లీ – కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం టెక్నాలజీ పరంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ఇది ఎప్పుడూ జరిగేదేనని పేర్కొన్నారు. ఆదివారం హర్దీప్ సింగ్ పూరీ మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ , అన్ని రంగాల వారిని భయ భ్రాంతులకు గురి చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఈ) చేస్తోందని దీని వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు పూరి. దీని వల్ల ఎలాంటి ముప్పు లేదన్నారు.
సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ లేదా కంటెంట్ సృష్టిలో విప్లవాత్మక మార్పులకు ఏఐ సహాయ పడుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. 30 బిలియన్ డాలర్ల సృజనాత్మక పరిశ్రమ 8 శాతం మంది శ్రామిక జనాభాకు ఉపాధి కల్పిస్తోందని ఆయన చెప్పారు.
“దేశంలో 100 మిలియన్ల కంటెంట్ సృష్టికర్తలతో భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని కంటెంట్ క్యాపిటల్” గా మారిందని స్పష్టం చేశారు హర్దీప్ సింగ్ పూరీ.