మన్ కీ బాత్ లో తెలుగు భాషా దినోత్సవం
ముందుగానే శుభాకాంక్షలు తెలిపిన మోడీ
ఢిల్లీ – దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పటి లాగే ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచంలో ఏ ప్రధాన మంత్రి మోడీ లాగా టెక్నాలజీని ఉపయోగించు కోవడం లేదు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ లీడర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.
తాజాగా మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్న నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఆయన తెలుగు భాష గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనికి కారణం ఏమిటంటే ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్బంగా ముందుగానే తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. దేశ భాష లందు తెలుగు లెస్స అన్న నానుడిని ప్రస్తావించారు ప్రధానమంత్రి. తెలుగు భాష అత్యంత తీయనైనదని, తెలుగు వారు ఆత్మీయమైన ఆతిథ్యం ఇవ్వడంలో ముందుంటారని కొనియాడారు.