ఒపీనియన్ పోల్స్ బక్వాస్ – యోగేంద్ర యాదవ్
ఇండియా టుడే..ఆజ్ తక్ సర్వేలపై ఆగ్రహం
ఢిల్లీ – సామాజిక కార్యకర్త, మేధావి యోగేంద్ర యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రముఖ మీడియా ఛానల్స్, సంస్థలు ముందస్తు అభిప్రాయ సేకరణతో ఒపీనియన్ పోల్స్ నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవన్నీ దేశంలో ఉన్న 143 కోట్ల ప్రజల అభిప్రాయాలను, ఆలోచనలను ప్రతిబింబించవని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. జాతీయ స్థాయిలో ఉన్న మీడియా సంస్థలు ప్రజల గొంతును వినిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఇలాంటి వాటి వల్ల సరైన వాస్తవాలు, నిజాలు బయటకు రాకుండా పోతాయని పేర్కొన్నారు.
మీడియాకు, ప్రచురణ, ప్రసార, డిజిటల్ మాధ్యమాలకు గురుతరమైన బాధ్యత ఉందని, ఆ విషయాన్ని మరిచి పోకూడదని స్పష్టం చేశారు యోగేంద్ర యాదవ్. ఓ వైపు ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య పేరుకు పోయిందని దాని గురించి ఎవరూ కూడా ప్రస్తావించక పోవడం విడ్డూరంగా ఉందన్నారు .
కోట్లాది మందికి ఉపాధి లేకుండా పోయిందని వాపోయారు. ఒపినీయన్ పోల్స్ ను ఎవరూ కూడా నమ్మ వద్దని కోరారు. ఇవి ప్రజల అభిప్రాయాలను ఏ మాత్రం ప్రతిబింబించవని స్పష్టం చేశారు.