ముందస్తు బెయిల్ కు అడ్డంకి లేదు
స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై స్పందించింది. కేసు విచారణ సందర్బంగా బెయిల్ మంజూరు చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేసింది.
ఎస్సీ, ఎస్టీకి సంబంధించి మరునాదన్ మలయాళీ ఎడిటర్ షాజన్ స్కారియాకు ఎందుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదంటూ ప్రశ్నించింది. దీనికి గల కారణాలు తమకు ఏవీ ప్రత్యేకించి కనిపించడం లేదని స్పష్టం చేసింది.
ఈ సందర్బంగా ఎడిటర్ మరునాదన్ మలయాళీ ఎడిటర్ కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తీర్పు చెప్పింది.
ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన సభ్యుడిని ఉద్దేశ పూర్వకంగా అవమానించడం లేదా బెదిరించడం వల్ల కుల ఆధారిత అవమానానికి గురైనట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది . ఇదిలా ఉండగా విచారణ చేపట్టిన ధర్మాసనం సీరియస్ కామెంట్స్ చేసింది. ముందస్తు బెయిల్ ను వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ముఖ్యమైన అంశంగా అభివర్ణించింది.