హైడ్రా కూల్చివేతలకు భగవద్గీత స్ఫూర్తి – సీఎం
ఒత్తిళ్లకు తల వంచే ప్రసక్తి లేదన్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఆక్రమణలపై మండిపడ్డారు. హైడ్రాపై స్పందించారు సీఎం. కూల్చి వేతలకు సంబంధించి ముందుకే వెళతామని, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
హైడ్రా కూల్చి వేతలకు భగవద్గీతనే స్పూర్తి అని చెప్పారు. ధర్మం గెలుస్తుంది అధర్మం ఓడి పోతుందని ఆనాడు శ్రీకృష్ణుడు చెప్పాడని, దానినే తమ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు సీఎం. శ్రీకృష్ణుని బోధ ప్రకారం తాము ఈ కూల్చివేతలను చేపడుతున్నట్లు ప్రకటించారు.
ప్రభావవంతమైన వ్యక్తులు ఈ ఫామ్ హౌస్‌లకు యజమానులుగా ఉన్నందున చాలా ఒత్తిడి ఉందన్నారు. ఎవరైనా, ఎంతటి వారైనా , ఏ స్థాయిలో ఉన్నా, ఏ పార్టీకి చెందిన వారైనా, చివరకు తమ పార్టీకి చెందిన వారైనా సరే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు ఎ. రేవంత్ రెడ్డి.
చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసే వారున్నారని మండిపడ్డారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చని అన్నారు.
వారెవరిని పట్టించుకోనని హెచ్చరించారు ఎ. రేవంత్ రెడ్డి.. చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామని హెచ్చరించారు.