ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన తారక్
యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కామెంట్స్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దివంగత సీఎం, నందమూరి తారక రామారావు వర్దంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఎన్టీఆర్ తనయుడు , ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ.
దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఎన్టీఆర్ కు వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్. తారక్ విషయంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగారని, ఆయనను ఎవరూ తక్కువ చేయలేరన్నారు. ఫ్లెక్సీలు తొలగిస్తే నష్టం ఏమీ జరగదన్నారు.
ఇదే సమయంలో నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు యార్లగడ్డ. మేనరికం సంబంధాలు మంచివి కావని తనతో చాలా సార్లు అన్నారని, కానీ చివరకు బాలకృష్ణ కూతురిని తన కొడుక్కి చేసుకున్నాడని ఇదెక్కడి నీతి అంటూ ప్రశ్నించారు . మొత్తంగా యార్లగడ్డ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.