సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన ష‌మీ భార్య

త‌న‌కు రూ. 10 ల‌క్ష‌లకు పైగా భ‌రణం పెంచాలి

ఢిల్లీ : ప్ర‌ముఖ క్రికెట‌ర్ , స్టార్ పేస‌ర్ మొహ‌మ్మ‌ద్ ష‌మీ భార్య హ‌సిన్ జ‌హాన్ మ‌రోసారి సంచ‌ల‌నంగా మారారు. ఇప్ప‌టికే కోర్టు ఈ ఇద్ద‌రికి విడాకులు మంజూరు చేసింది. తుది తీర్పు వెలువ‌రించింది. అంతే కాకుండా ష‌మీ ప్ర‌తి నెలా త‌న‌కు భ‌ర‌ణం ఇవ్వాల‌ని ఆదేశించింది. అయితే మ‌రోసారి ర‌చ్చ‌కు ఎక్కింది మాజీ భార్య‌. త‌న‌కు రూ. 10 ల‌క్ష‌ల‌కు పైగా భ‌ర‌ణం పెంచాల‌ని కోరింది. ఈ మేర‌కు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఇదిలా ఉండ‌గా దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై భార‌త క్రికెట‌ర్ ష‌మీ, ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం స్పంద‌న కోరింది.

విచార‌ణ సంద‌ర్బంగా మధ్యంతర ప్రాతిపదికన భరణం కోసం, షమీస్ భార్య, కుమార్తెకు కలకత్తా హైకోర్టు ఆదేశించిన అవార్డు న్యాయ‌బ‌ద్దంగానే ఉంద‌ని పేర్కొంది. ధ‌ర్మాస‌నం కీల‌క సూచ‌న‌లు చేసింది. ఇదిలా ఉండ‌గా మహ్మద్ షమీ తన విడిపోయిన భార్య హసిన్ జహాన్ , కుమార్తెకు నెలవారీ భరణం రూ.4 లక్షల భరణం చెల్లించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. జహాన్‌కు నెలకు రూ.1.50 లక్షలు చెల్లించాల్సి ఉండగా, కుమార్తెకు నెలకు రూ.2.50 లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. కలకత్తా హైకోర్టు భరణంపై ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేసింది . గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, 2005లోని సెక్షన్ 20 ప్రకారం, ద్రవ్య ఉపశమనం తగినంతగా, న్యాయంగా, సహేతుకంగా , వైవాహిక జీవనశైలికి అనుగుణంగా ఉండాలని త‌ను పిటిష‌న్ లో కోరింది.

  • Related Posts

    బాబ‌ర్ ఆజమ్ కు భారీ జ‌రిమానా

    ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియమావ‌ళి ఉల్లంఘ‌న రావ‌ల్పిండి : పాకిస్తాన్ జ‌ట్టు మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను త‌న‌కు భారీ జ‌రిమానా విధించింది ఐసీసీ. అతని క్రమశిక్షణా రికార్డులో ఒక…

    చెన్నై సూప‌ర్ కింగ్స్ చెంత‌కు చేరిన శాంస‌న్

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులోకి జ‌డేజా, శామ్ క‌ర‌న్ చెన్నై : ఎన్నో రోజులుగా కొన‌సాగుతున్న ఉత్కంఠ‌కు తెర ప‌డింది కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ అంశం. ఏ జ‌ట్టులోకి త‌ను వెళ‌తాడ‌నేది క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *