ఏపీలో ఐఏఎస్ లకు స్థాన చలనం
శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పోస్టింగ్స్
అమరావతి – ఆంధ్రప్రేదశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ , ఐపీఎస్ లను బదిలీ చేసింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న కొత్త ఐఏఎస్ లకు పోస్టింగ్ లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా మార్కాపురం సబ్ కలెక్టర్‌గా వెంకట్ త్రివినాగ్. పాలకొండ సబ్ కలెక్టర్‌గా యశ్వంత్ కుమార్ రెడ్డిని నియమించారు.
నర్సీపట్నం సబ్ కలెక్టర్‌గా కల్పశ్రీ. పెనుకొండ సబ్ కలెక్టర్‌గా మౌర్య భరద్వాజ్, తిరుపతి సబ్ కలెక్టర్ గా రాఘవేంద్ర మీనా, పాడేరు సబ్ కలెక్టర్ గా శౌర్యమన్ పటేల్ , కందకూరు సబ్ కలెక్టర్ గా తిరుమణి శ్రీ పూజ ను నియమించారు.
వీరితో పాటు తెనాలి సబ్ కలెక్టర్‌గా సంజన సింహకు బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా వచ్చే నెల 9వ తేదీ లోగా రిపోర్ట్ చేయాలని కొత్త సబ్ కలెక్టర్ ను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.