DEVOTIONAL

శ్రీ‌కృష్ణుడి గీతోప‌దేశం స్పూర్తి దాయ‌కం

Share it with your family & friends

ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – భ‌గ‌వానుడు శ్రీ‌కృష్ణుడు బోధించిన గీతోప‌దేశం స్పూర్తి దాయ‌క‌మ‌ని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఇవాళ దేశ వ్యాప్తంగా శ్రీ‌కృష్ణ జ‌న్మాష్ట‌మి జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు సీఎం.

మానవ జీవితంలో ‘గీత’ బోధనలు ప్రభావ శీలమైనవనీ, మానవుడి ప్రతి దశలోనూ కృష్ణ భగవానుడు కొలువై ఉంటారని అన్నారు. ఆ శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని ప్రార్థిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఒక సందేశంలో స్ప‌ష్టం చేశారు.

ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాన‌ని తెలిపారు. గీతాసారంతో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించు కోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమేన‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీ కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చు అని పేర్కొన్నారు అనుముల రేవంత్ రెడ్డి. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీల మేఘ శ్యాముని కృపా, కటాక్షం రాష్ట్రంపై సదా ఉండాలని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు.