డ్రగ్స్ అక్రమ రవాణాపై ఉక్కు పాదం
హెచ్చరించిన కేంద్ర మంత్రి అమిత్ షా
ఢిల్లీ – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి పెను ముప్పుగా డ్రగ్స్ అక్రమ రవాణా మారిందన్నారు. ఇది దేశ భద్రతకు ఆటంకం కలిగించేలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు అమిత్ షా.
డ్రగ్స్ అక్రమ రవాణాతో వచ్చిన డబ్బులను ఉగ్రవాదం, నక్సలిజం కోసం దేశంలో ఉపయోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. డ్రగ్స్ అక్రమ రవాణా మన దేశానికే కాదు యావత్ ప్రపంచానికి సవాల్ గా మారిందని అన్నారు.
కేంద్ర సర్కార్ దీనిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టిందని చెప్పారు అమిత్ చంద్ర షా. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు. ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కొంటామని, డ్రగ్స్ అక్రమ రవాణాకు చెక్ పెడతామని స్పష్టం చేశారు కేంద్ర హోం శాఖ మంత్రి.
ఇందుకు సంబంధించి నాలుగు సూత్రాలను ప్రతిపాదించారు అమిత్ షా. అవేమిటంటే డ్రగ్స్ ను ఎక్కడ సరఫరా చేస్తున్నారు, రవాణా వ్యవస్థను గుర్తించి విచ్చిన్నం చేయడం, దోషులను పట్టు కోవడం, డీ ఆడిక్షన్ సెంటర్లను నిర్వహించడం చేస్తామన్నారు.