మహిళలపై నేరాలకు పాల్పడితే ఖబడ్దార్
తీవ్ర స్థాయిలో హెచ్చరించిన ప్రధాని మోడీ
ఢిల్లీ – దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. ఆయన దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న నేరాల గురించి స్పందించారు. ప్రధానంగా ఇటీవల పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కోటా ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ రేప్, మర్డర్ కు గురి కావడాన్ని ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆ కుటుంబానికి తమ సర్కార్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో కేంద్రం కీలక చర్యలు చేపట్టిందన్నారు.
రోజు రోజుకు బాలికలు, యువతులు, మహిళలపై దాడులు పెరుగుతుండడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నరేంద్ర మోడీ. ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయా రాష్ట్రాలు పూర్తిగా మహిళలపై నేరాలకు పాల్పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకు కేంద్రంతో సహకరించాలని కోరారు.
ఈ సందర్బంగా ప్రధానమంత్రి నేరస్తులు ఎవరైనా.. విడిచిపెట్టొద్దని రాష్ట్రాలకు సూచించారు మోడీ. ప్రధానంగా మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించ వద్దని కోరారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా చేస్తామని హెచ్చరించారు. చట్టాలను మరింత పటిష్టం చేస్తామని ప్రకటించారు దేశ ప్రధాన మంత్రి.