మా కుటుంబానికి ప్రాణ హాని – సీఎం
సంచలన ప్రకటన చేసిన బిస్వా శర్మ
అస్సాం – ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు, తన కుటుంబానికి జిహాద్ నుంచి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సీఎం స్పందించారు. ల్యాండ్ జిహాద్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నందున తమకు పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇవాళ సీఎం చేసిన ప్రకటన కలకలం రేపింది. ఇప్పటికే కేంద్రం భారీ ఎత్తున సెక్యూరిటీని పెంచే నిర్ణయం తీసుకుంది.
భద్రతా కారణాల దృష్ట్యా తాను ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. ఈ విషయాన్ని మీడియాకు కూడా తెలియ చేస్తున్నట్లు తెలిపారు. తనకు, తన ఫ్యామిలీకి ప్రాణ హాని ఉన్నప్పటికీ తాను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు హిమంత బిస్వా శర్మ.
ముస్లింలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ ప్రాంతంలో భూములను కొనుగోలు చేస్తున్నారని, ఆ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వారి కార్యకలాపాలను, కదలికలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని చెప్పారు ముఖ్యమంత్రి.
అయితే అస్సాంలో మారుతున్న జనాభాకు వ్యతిరేకంగా నేను పోరాడుతూనే ఉంటానని ప్రకటించారు హిమంత బిస్వా శర్మ.