ఎస్సీ వర్గీకరణపై కేంద్ర కమిటీ
ఏర్పాటు చేసిన మోదీ సర్కార్
న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే పీఎం ప్రకటించిన విధంగానే ఎస్సీ వర్గీకరణపై కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. చెప్పినట్లగానే కేంద్ర సర్కార్ శుక్రవారం కమిటీ ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉండగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులుగా కేంద్ర హోం శాఖ , న్యాయ శాఖ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులు ఉన్నట్లు వెల్లడించింది సర్కార్.
ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు పీఎం హామీ ఇచ్చారు. ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గాను భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఓకే చెప్పింది.
ఈ తరుణంలో కేంద్ర సర్కార్ కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది . ఈనెల 22న ఏర్పాటైన కమిటీ మొదటిసారిగా భేటీ కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ.