DEVOTIONAL

శ్రీ‌కృష్ణుడు భ‌గ‌వ‌త్ స్వ‌రూపుడు – స్మితా

Share it with your family & friends

శ్రీ‌కృష్ణ జ‌న్మాష్ట‌మి వేడుక‌ల్లో స‌బ‌ర్వాల్

హైద‌రాబాద్ – భ‌గ‌వానుడు శ్రీ‌కృష్ణుడు బోధించిన గీతోప‌దేశం స్పూర్తి దాయ‌క‌మ‌ని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి, సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ స్మితా స‌బర్వాల్. ఇవాళ దేశ వ్యాప్తంగా శ్రీ‌కృష్ణ జ‌న్మాష్ట‌మి జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. అంత‌కు ముందు హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఇస్కాన్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో ఆమె పాల్గొన్నారు.

మానవ జీవితంలో ‘గీత’ బోధనలు ప్రభావ శీలమైనవనీ, మానవుడి ప్రతి దశలోనూ కృష్ణ భగవానుడు కొలువై ఉంటారని అన్నారు. ఆ శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు స్మితా స‌బ‌ర్వాల్.

ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. గీతాసారంతో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించు కోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమేన‌ని స్ప‌ష్టం చేశారు స్మితా స‌బ‌ర్వాల్.

ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీ కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చు అని పేర్కొన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీల మేఘ శ్యాముని కృపా, కటాక్షం రాష్ట్రంపై సదా ఉండాలని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు.