పిల్లల పేరుతో వేల కోట్లు మింగిన జగన్
తెలుగుదేశం పార్టీ సంచలన ఆరోపణ
అమరావతి – గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ సర్వ నాశనమైందని ఆరోపించింది తెలుగుదేశం పార్టీ. సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించింది. పిల్లల పేరుతో వేల కోట్లు దండుకున్నాడని ఆరోపించింది.
తలతిక్క విధానాలతో, ప్రచార యావ తప్ప, నిజంగా గ్రౌండ్‌లో జరిగింది శూన్యమని పేర్కొంది. నాడు-నేడు అనేది బక్వాస్ కార్యక్రమమని, దోచుకునేందుకు వేసిన అద్భుతమైన ప్లాన్ అంటూ మండిపడింది.
ఇంగ్లీష్ మీడియం అనేది చంద్రబాబు తీసుకొచ్చారని కానీ జగన్ రెడ్డి తానే తీసుకు వచ్చినట్లు ప్రచారం చేసుకున్నాడని ఆరోపించింది టీడీపీ. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా ఉండాలనేది తమ విధానమని పేర్కొంది.
మధ్యాహ్న భోజనం అభాసు పాలైందని, గత 5 ఏళ్ల కాలంలో ఒక్క ఏడాది కూడా విద్యా దీవెన 50 శాతానికి మించి ఇవ్వలేదని ఆరోపించింది.
జగన్ మోహన్ రెడ్డి తలతిక్క విధానాలు తట్టుకోలేక 2024 నాటికి 72,000 మంది పిల్లలు ప్రభుత్వ బడుల నుంచి వెళ్ళిపోయారని వాపోయింది. బడుల విలీనం కారణంగా వేలాది మంది ప్రభుత్వ పాఠశాలలను వదిలేశారని, ప్రైవేట్ బాట పట్టారని ఆరోపించింది టీడీపీ.