హైడ్రా నిర్వాకం భయాందోళనలో జనం
నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కూనంనేని
హైదరాబాద్ – ఖమ్మం జిల్లాక చెందిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. హైడ్రా నిర్వాకం కారణంగా జనం బెంబేలెత్తి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైడ్రా కేవలం మధ్య తరగతి, సామాన్యులనే లక్ష్యంగా చేసుకుని పని చేస్తోందని ఆరోపించారు. బడా బాబులు, పారిశ్రామికవేత్తలు, అన్ని పార్టీలకు చెందిన నేతల ఫామ్ హౌస్ లను ఎందుకు కూల్చడం లేదంటూ ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
ప్రభుత్వం ఏ ప్రాతిపదికన కూల్చి వేస్తోందో చెప్పాలని సీపీఐ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిన వారిని ఎందుకు వదిలి వేస్తున్నారంటూ నిలదీశారు. హైడ్రా పూర్తిగా అక్రమ నిర్మాణాలు ధ్వంసం చేయాలని భావిస్తే ..ఇప్పటికిప్పుడు కూల్చితే హైదరాబాద్ నగరం సగానికే పరిమితం అవుతుందని అన్నారు కూనంనేని సాంబశివరావు.
హైడ్రా నుంచి సామాన్యులు, పేదలను మినహాయించాలని ఆయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించారు.