బాధ పడితే మన్నించండి
స్పందించిన నయనతార
తమిళనాడు – కోలీవుడ్ కు చెందిన సినీ నటి నయనతార కీలక వ్యాఖ్యలు చేసింది. తాను నటించిన అన్నపూర్ణి చిత్రం విడుదలైంది. దీనిపై పెద్ద ఎత్తున ఓ వర్గానికి చెందిన వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ మనోభావాలు దెబ్బ తినేలా ఉందంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా దర్శకుడు, చిత్ర యూనిట్ పై భగ్గుమన్నారు.
ప్రత్యేకించి హిందువుల మనో భావాలను తప్పు పట్టేలా ఉందంటూ వాపోయారు. దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతూ వస్తున్నారు నయనతార. తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతుండడంతో స్పందించారు నటి. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. మనో భావాలు దెబ్బ తీయాలని తాము సినిమా తీయలేదని పేర్కొంది.
ఒకవేళ బాధ పెట్టి ఉంటే తమను మన్నించాలని, సినిమాను ఆదరించాలని కోరారు. ఇందుకు సంబంధించి ఓం చిహ్నం, జై శ్రీరామ్ నినాదంతో కూడిన క్షమాపణ లేఖను రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా గత ఏడాది బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటించింది. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.