క్రీడాకారిణి సాదియాకు లోకేష్ సాయం
కృతజ్ఞతలు తెలిపిన అల్మాస్ కుటుంబం
అమరావతి – ఏపీ విద్యా , ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా ఆల్మాస్ ను ప్రత్యేకంగా అభినందించారు. అంతే కాకుండా తన నియోజకవర్గానికి చెందిన క్రీడాకారిణి కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆమెకు అన్ని విధాలుగా ప్రభుత్వం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
ఈ మేరకు తక్షణ సాయంగా రూ. 3 లక్షలు ప్రకటించారు. ఇందుకు సంబంధించి చెక్కును పవర్ లిఫ్ట్ పోటీలలో పాల్గొనేందుకు సాదియా ఆల్మాస్ కుటుంబానికి అందజేశారు టీడీపీ నేతలు మంత్రి తరపున. ప్రస్తుతం నారా లోకేష్ అధికారిక పర్యటనలో ఉన్నందు వల్ల రాలేక పోయారు.
సాదియా ఆల్మాస్ ను ప్రైడ్ ఆఫ్ మంగళగిరి అని పేర్కొన్నారు. నారా లోకేష్ సాదియాను ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా మానవతా దృక్ఫథంతో మంత్రి నారా లోకేష్ అందించిన సాయానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో రాష్ట్రం తరపున మరింత సాయం అందిస్తే బావుంటుందని పేర్కొన్నారు.
కాగా రాష్ట్రాన్ని క్రీడలకు కేరాఫ్ గా తయారు చేస్తామని ఇటీవలే ప్రకటించారు నారా లోకేష్.