నన్ను కాల్చండి కానీ బిల్డింగ్ కూల్చకండి
నిప్పులు చెరిగిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్
హైదరాబాద్ – ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం హైదరాబాద్ లో దూకుడు పెంచుతోంది హైడ్రా. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చి వేస్తోంది. తాజాగా రాయదుర్గం, ఇతర ప్రాంతాలలో ధ్వంసం చేయడంతో బాధితులు రోడ్డెక్కారు.
ఇదే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యే స్పందించారు. బండ్లగూడ లోని ఫాతిమా ఓవైసీ కాలేజీ భవనాన్ని కూల్చి వేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై తీవ్రంగా స్పందించారు అక్బరుద్దీన్ ఓవైసీ.
ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలంటే హైడ్రా అధికారులు తనపై కాల్పులు జరపాలని, కానీ పేద పిల్లల కోసం నిర్మించిన ఫాతిమా ఓవైసీ కాలేజీని కూల్చవద్దని కోరారు. కేవలం పేదలను దృష్టిలో పెట్టుకుని ఉచితంగా విద్యను అందించేందుకు 12 భవనాలను నిర్మించానని చెప్పారు.
వీటిని కావాలని కొందరు తప్పుగా ఉందంటూ చూపించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు ఓవైసీ. గతంలో తనను చంపేందుకు కుట్రలు పన్నారు. చివరకు బుల్లెట్ల వర్షం కురిపించారు. కత్తులతో దాడి చేశారు..తిరిగి మీరు కూడా చేయాలని అన్నారు. కానీ కూల్చవద్దని కోరారు ఎమ్మెల్యే.